Showing posts with label Garuthmantha Kavach - A0336. Show all posts
Showing posts with label Garuthmantha Kavach - A0336. Show all posts

Garuthmantha Kavach - A0336


Garuthmantha Kavach - A0336

Product Code : A0336

Rs.250/-

సర్ప దోషాలను హరింపజేసే గరుత్మంత కవచం
శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి, వినయశీలి. ఆర్త్రత్రాణపరాయణుడైన శ్రీమహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలనుకున్నా గరుత్మంతుడు సిద్ధంగా ఉంటాడు. వెంటనే విష్ణువు గరుడారూఢుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు. సాధారణంగా విష్ణుమూర్తి ఆలయాలలో మూలవిరాట్టుకి అభిముఖంగా గరుత్మంతుడుంటాడు. శ్రీవైష్ణవ చిహ్నాలలో ఊర్ధ్వపుండ్రాలకు ఇరుప్రక్కలా శంఖ చక్రాలు, వాటికి ఇరుప్రక్కలా హనుమంతుడు, గరుత్మంతులుంటారు. నిద్రించేముందు శ్లోకం పఠించే సంప్రదాయం ఉంది. ఇందులో గరుత్మంతుని స్మరణ కూడా ఉంది.
రామం స్కందం హనూమంతం వైనతేయం వృకోదరం
శయనే యః పఠేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి.
అథర్వణ వేదంలో గారుడోపనిషత్తు ఉంది. అందులో వైనతేయుడైన గరుడుడు విషదహారి అని చెప్పబడింది. గరుత్మంతుని స్వరూపం, అతని ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు ఇలా చెప్పారు దక్షిణ పాదము స్వస్తికము, ఎడమపాదము కుంచితముగా ఉండి విష్ణువుకు నమస్కరిస్తున్న గరుత్మంతునికి నమస్కరించెదను. అతనికి అనంతుడు వామకటకము, వాసుకి యజ్ఞసూత్రము. తక్షకుడు కటిసూత్రము, కర్కోటకుడు హారము. దక్షిణ కర్ణమున పద్ముడు, వామకర్ణమున మహాపద్ముడు, తలమీద శంఖుడు, భుజముల మధ్య గుళికుడు ఉన్నారు. అతడు నాగులచే సేవింపబడుచున్న కపిలాక్షుడు. నాగాభరణ భూషితుడు. బంగారు కాంతి కలవాడు. పొడవైన బాహువులు, పెద్ద మూపు, మోకాళ్ళనుండి బంగారు రంగు కలిగినవాడు. మొలపైన తెలుపు రంగు, కంఠము వరకు ఎరుపు రంగు, వంద చంద్రుల కాంతిగల ముక్కు, కిరీటము ఉన్నవాడు. గరుత్మంతుని పేరు తలచినంతనే సర్వవిషములు హరించిపోతాయి.
రామాయణం యుద్ధకాండలో నాగబంధవిమోచన అనే ఘట్టం ఉంది. భాగం పారాయణకు శ్రేష్టమైన భాగాలలో ఒకటిగా భావిస్తారు. భగవద్గీత విభూతి యోగము 30 శ్లోకములో కృష్ణుడు తాను వైనతేయశ్చ పక్షిణామ్ - పక్షులలో నేను వినతాసుతుడైన గరుత్మంతుడిని - అని తెలిపాడు.
గరుత్మంత కవచధారణ వలన కలిగే లాభాలు
1.     సవతి బాధలు తొలగాలంటే గరుత్మంత కవచధారణ ఉత్తమ మార్గం.
2.     దాస్యం, ఒకరి కింద పనిచేయడం, బానిసగా ఉండేవారు గరుత్మంత కవచాన్ని ధరించి గరుత్మంతుణ్ణి ప్రార్థించినా విముక్తి లభిస్తుంది.
3.     సర్ప దోషాలు, సర్ప భయం, దెయ్యాలు, భూతాలు, పిశాచాల భయంగలవారు తప్పక ధరింపదగ్గ కవచం గరుత్మంత కవచం.
4.     సంపూర్ణ ఆరోగ్యం పొందదలచేవారు గరుత్మంత కవచం ధరించడం మంచిది.
5.     పీడ కలలు, దుస్స్వప్నాలు, చెడు లేక భయంకర దృశ్యాలు చూసి భయాందోళనకు గురైనవారు గరుత్మంత కవచం ధరించి గరుత్మంత ధ్యానం చేస్తే చాలు.   
– మల్లంపల్లి రామలింగ శాస్త్రి


Total Pageviews

Flag Counter

Followers