Panchalogha Panchasakthula Rupu - A1521
Product Code : A1521
Rs. 1350/-
పంచధాతు పంచ శక్తుల రూపు
ప్రప్రథమంగా
వ్యాపించియున్న శూన్యమే శ్రీ విరాట్ విశ్వపరబ్రహ్మం, ఆ పరబ్రహ్మం నుండి,
పంచభూతాలు, దాదాపు ఒకే తరుణంలో రెండు ఆకారాలు ప్రాణం పోసుకున్నాయి. అందునుండి
క్షణంలో కోటివంతుకాలం ముందు పుట్టినది మగ ఆకారం, అనంతరం పుట్టినది స్త్రీ ఆకారం.
కనుక ఈ పంచధాతు పంచశక్తుల రూపును ఆడ, మగ, చిన్న, పెద్ద ఎవరైనా ధరించవచ్చు. ఈ
రూపును ధరించడంవలన పరబ్రహ్మం అనుగ్రహం తథ్యం. తద్వారా
వేదజ్ఞానం అంటే మంచి తెలివితేటలు కలుగుతాయి.
నిర్గుణబ్రహ్మం
పంచభూతాలుగా రూపాంతరం చెంది సగుణబ్రహ్మమయ్యాడు. శబ్ద గుణంతో ఆకాశం, దాని నుండి
శబ్దస్పర్శ గుణాలతో వాయువు, ఆ రెండిటి నుండి రూపగుణంకూడా కలిసి
శబ్దస్పర్శరూపగుణాలతో అగ్ని, ఆ మూడిటి సమ్మేళనంతో శబ్దస్పర్శరూపరస గుణాలతో నీరు, ఈ
నాలుగు గుణాలతో పాటు గంధం కూడా కలిసి శబ్దస్పర్శరూపరసగంధ గుణాలతో ఫృథ్వి
ఏర్పడ్డాయి. కనుక ఈ పంచశక్తుల రూపును ధరించడం వలన భూమికి సంబంధించిన పనుల్లో విజయం
కలుగుతుంది. భూమి, ఇల్లు కొనుగోలు యత్నం ఫలిస్తుంది. భూమిలో నిధులు కోసం
వెతికేవారికి లాభంగా ఉంటుంది. వాహనాలు సొంతమౌతాయి. ముఖ్యంగా ఆటో, టాక్సీ, బస్,
లారీ డ్రైవర్లు ఈ రూపును తప్పక ధరిస్తే వారికి క్షేమము లాభము కలుగుతుంది.
పంచభూతాలతోపాటు
ప్రాణం పోసుకున్న ఆకారాల్లోని మగ ఆకారానికి కర్మ అని, స్త్రీ ఆకారానికి కర్మిణి
అనే నామధేయం స్థిరపడిపోయింది. ఈ ఆకారాలే ప్రపంచంలోని మొదటి ఆకారాలు కనుక వారిని
విశ్వకర్మ అనీ, విశ్వకర్మిణి అని పిలువసాగారు. విశ్వకర్మ అంశతో బ్రహ్మ, విష్ణు,
పరమశివుడు, ఇంద్రుడు, సూర్యుడు అనే ఐదుమంది పురుషులు ఆవిర్భవించగా, విశ్వకర్మిణి
అంశతో సరస్వతి, లక్ష్మీ, పార్వతి, ఇంద్రాణి, ఉష అనే ఐదుమంది స్త్రీలు
ఆవిర్భవించారు. కనుక ఈ పంచశక్తుల రూపును ధరించినవారికి వంశవృద్ధి కలుగుతుంది.
ఇలా విశ్వకర్మ,
విశ్వకర్మిణి నుండి ఆవిర్భవించిన వీరు తెలుపు, నీలం, ఎరుపు, పసుపు, పచ్చ మొదలైన
పంచభూతాల వర్ణాలతోనే గాక... పొడుగు, పొట్టి, లావు, సన్నం, సాధారణం మొదలైన శారీరక
తేడాలతో... జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, మాయాశక్తి, లయశక్తి మొదలైన
శక్తులేగాక 64 చిన్న చిన్న మార్పులతో ఆవిర్భవించారు. వీరే దేవతలయ్యారు. ఒక్కొక్కరూ
ఒక్కొక్క శక్తికి అధిపతులయ్యారు. కనుక ఈ పంచశక్తుల రూపును ధరించినవారికి ఉన్నత
విద్య, మంచి ఉద్యోగం / వ్యాపారం, కార్యజయం, అధికారంతో కూడిన పదవి / రాజకీయ బలం /
ప్రజాకర్షణ, పరిపూర్ణ ఆరోగ్యం / ప్రభుత్వంతో ముడిపడిన లావాదేవీలలో లాభం చేకూరుతాయి.
మల్లంపల్లి
రామలింగ శాస్త్రి