Sri Chakram Yantra Tayat - A1524
Product Code : A1524
Rs. 1000/-
శ్రీచక్ర యంత్ర
తాయత్తు
శ్రీ చక్ర
సంచారిణి, శ్రీ మహామేరు శిఖరాగ్ర బిందు మధ్యాంతర నివాశిని శ్రీశ్రీశ్రీ
రాజరాజేశ్వరి, బాల త్రిపురసుందరి మాత భువనేశ్వర ఆశీస్సులగల ఈ శ్రీచక్ర యంత్ర
తాయత్తును పంచమినాడు ధరించినవారికి ధనాభివృద్ధి కలుగుతుంది.
ఆదిశంకరులు
భారతదేశం యావత్తు యాత్ర చేస్తూ కంచి కామాక్షి ఆలయంతో పాటు పలు శక్తి ఆలయాలలో
శ్రీచక్రాన్ని స్థాపించారు. ఇటువంటి మహత్తరమైన శ్రీచక్ర యంత్ర తాయత్తును సప్తమినాడు
ధరించడంవలన జనాకర్షణ కలుగుతుందని పురాణాలు ఘోషిస్తున్నాయి.
శ్రీచక్రంలో
బిందు రూపంలో ఉన్న ఇక్కడి శక్తి అమ్మలనుగన్న మూలపుటమ్మ మహాత్రిపురసుందరిదేవియే. ఆ
బిందు శివశక్తుల కలయికకు ప్రతీక. అక్కడనుండే బ్రహ్మాండం ఇతర కోణాలద్వారా
రూపుసంతరించుకుంది. తొమ్మిది వరుస త్రిభుజాలలో నాలుగు శివ త్రిభుజాల వరసలైతే, ఐదు
శక్తి త్రిభుజాల వరసలు. ఈ బ్రహ్మాండానికి మూల ప్రకృతులు ఇవే. శక్తి లేనిదే శివుడు
లేడనే సత్యాన్ని ఋజువుచేసే విధంగా శ్రీచక్రంలోని శివ త్రిభుజాలు వరసలపై శక్తి
త్రిభుజాల వరసలు అమరి ఉంటాయి. శ్రీచక్ర యంత్ర తాయత్తును దశమినాడు ధరించడంవలన
అవివాహితులకు వివాహయోగం కలుగుతుంది.
ఆదిశక్తి యొక్క
పరిపూర్ణ సంపూర్ణ శక్తి పవిత్ర బిందురూపంలో శ్రీచక్రం పైభాగంలో చోటుచేసుకుంది. ఆ
పవిత్ర బిందు అత్యంత బ్రహ్మాండ శక్తికి, ఇతర కోణాలు ఇతర శక్తులను
వెలువరుస్తున్నట్లు రూపుసంతరించుకుని యంత్రాలలో తలమాణిక్యంగా నిలిచే శ్రీచక్ర
యంత్ర తాయత్తును ఏకాదశినాడు ధరించడంవలన జీవితంలో తిరుగులేని విజయాలను సాధించగలుగుతారు.
శ్రీచక్రంలోని
తొమ్మిది త్రిభుజాలు మానవునిలోని తొమ్మిది ధాతువులకు ప్రతీక. శక్తి ధాతువులేమో
శరీరం, రక్తం, మాంసం, మేధస్సు, ఎముకలైతే శివధాతువులేమో రేతస్సు-వీర్యం,
అస్థిసారము, ప్రాణాధారమైన శక్తి, వ్యక్తిత్వ ఆత్మ. కనుక శ్రీచక్ర యంత్ర తాయత్తును
పౌర్ణమినాడు ధరించడంవలన పరిపూర్ణ ఆరోగ్యం, సంతానభాగ్యం కలుగుతుంది.