Hanumath Pasupu - A1518
Product Code : A1518
Rs. 200/-
హనుమత్ పసుపు
ఈ సృష్టిలో ప్రతి వస్తువుకి ఒక ఉపయోగముంది. ప్రతి పదార్థానికి ఒక
ప్రయోజనముంది. కొన్ని వస్తువులు నిత్యవసరాల జాబితాలో చేరిపోతే, మరి కొన్ని
ఆధ్యాత్మిక పథంలో మహిమాన్వితమై అడుగడుగునా మనల్ని పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో
హనుమత్ పసువు ఒకటి.
సాధారణ పసుపును మనం శుభకార్యాలలోను... పండుగల సందర్భాల్లోనూ... వంటకాల్లోనూ
ఉపయోగిస్తుంటాం. ఇక ఈ హనుమత్ పసుపును మాత్రం దుష్టగ్రహాల బారి నుంచి బయటపడటానికి
వాడుతుంటారు. సాధారణ పసుపుకొమ్ము ద్వారా వచ్చే పసుపులా కాకుండా, దీని ద్వారా వచ్చే
పసుపు కాస్త నలుపు రంగులో వుంటుంది. ఇది పసుపు వాసన కాకుండా కర్పూరం వాసనలా
అనిపిస్తూ వుంటుంది.
మధ్యప్రదేశ్, బెంగాల్, నేపాల్ మరియు ఈశాన్య రాష్ట్రాలలో లభించే ఈ హనుమత్ పసుపును
ఆవు పాలతో కడిగి తమవద్ద ఉంచుకుని హనుమంతుణ్ణి తలచుకుంటే వారిని ఆత్మలు, పిశాచాలు,
దయ్యాలు గాలిధూళి వంటివి పట్టవు.
హనుమత్ పసుపుకి ఆవుపేడ పూసి, పసుపు నీటితో కడిగి తమ వద్ద ఉంచుకుని హనుమంతుణ్ణి
ధ్యానిస్తే వారిని ఎవరూ చేతబడి, వశీకరణం చేయలేరు.
రెండు హనుమత్ పసుపు కొమ్ములను ఆవు పెరుగుతో కడిగి అనంతరం నీటితో శుభ్రపరచి తెలుపు
వర్ణ గుడ్డలో మూటకట్టి ధనం దాచుకునే పెట్టేలో ఉంచుకుని హనుమంతుణ్ణి ప్రార్థిస్తూ
ధూపం వేస్తూవుంటే విపరీత ధనయోగం కలుగుతుంది.
సంతానం లేనివారు హనుమత్ పసుపును ఆవు మూత్రంతో కడిగి తెల్ల గుడ్డలో మూటకట్టి
భర్త మొలకి, భార్య కుడి చేతికి కట్టుకుని హనుమంతుణ్ణి వేడుకోవడంవలన నపుంసకత్వ
సమస్యలు తొలగి సంతానోత్పత్తికి దోహదపడుతుంది.
హనుమత్ పసుపు కొమ్మును కొంచం హనుమత్ సింధూరంతోపాటు సింధూరం రంగు గుడ్డలో
కట్టి, హనుమంతుడికి మనస్సులోనే నమస్కరించుకుని సాంబ్రాణితో ధూపం వేసి ప్రధాన
ద్వారం పైన కట్టడం వలన దుష్టగ్రహాల బారి నుండి బయటపడవచ్చు.
అంతుపట్టని రోగాలు, దీర్ఘకాలిక జ్వరాలు, ఉబ్బసం, మూర్ఛ, ఋతు లోపాలతో
బాధపడేవారు హనుమత్ పసుపును ఆవు పేడతో అలికి, ఆవు మూత్రంలో తడిపి, ఆవు పాలతో
శుభ్రపరచి తమ వద్ద ఉంచుకుని హనుమంతుడి నామాలను ఉచ్ఛరిస్తూంటే ఊరట కలుగుతుంది.
కేన్సర్ వ్యాధితో బాధపడేవారు సైతం హనుమత్ పసుపును తమ వద్ద ఉంచుకోవడం వలన మేలు
కలుగుతుంది.
హనుమత్ పసుపును ఆవు మూత్రంలో తడిపి, నీటితో శుభ్రపరచి నల్లని వస్త్రంలో మూట
కట్టి మెడలో ధరించి హనుమంతుడిని మనస్సులో ధ్యానిస్తూంటే మరణభయం తొలగుతుంది.
@
మల్లంపల్లి రామలింగ శాస్త్రి