Ammoru Mariamma Rupu - A1522
Product Code : A1522
Rs. 200/-
అమ్మోరు మారియమ్మ రూపు
అమ్మోరు మారియమ్మ దక్షిణ భారతదేశపు దేవత అని
చెప్పవచ్చు. మారియమ్మ ఆంధ్రాలో అమ్మోరుగా ప్రసిద్ధికెక్కిన దేవత. ముఖ్యంగా ఆంధ్రా,
తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో అడుగడుగునా అమ్మోరుకు ఆలయాలున్నాయి. అమ్మోరు
శ్రీమహావిష్ణువు తోబుట్టువైన మహామాయ అంశ అని, పరశురాముని తల్లి రేణుకాదేవి అంశ అని,
శీతలదేవి అంశ అని, దుర్గ అంశ అని, ద్రౌపది అంశ అని, గ్రామదేవత అనీ భావిస్తారు.
మోసపోయినవారికి అండ అమ్మోరు అంటోంది పురాణాలు.
దుష్టబుద్ధిగల పురుషులవలన మోసపోయిన స్త్రీలు, ఎండమావి జిత్తులమారితనంగల స్త్రీలవలన
మోసపోయిన పురుషులు అమ్మోరు రూపును ధరించి “ఓం అమ్మోరు మారియమ్మ దేవతాయై నమః” అని దేవిని ప్రతి నిత్యం 108 మార్లు ప్రార్థిస్తే వారికి నూతన జీవితం
సమకూరుతుంది. తమిళనాడులోని సమయపురం క్షేత్రంలోని మారియమ్మ అమ్మోరును దర్శించుకుంటే
శుభాలు త్వరగా కలుగుతాయి.
దగా, కుట్ర, వంచన, అసత్యం, దోషారోపణ వలన
ఆస్తిపాస్తులను పోగొట్టుకున్నవారు, వ్యాపార భాగస్వాములవలన మోసపోయినవారు, ఉద్యోగంలో
అవమానాలు చవిచూసినవారు సైతం అమ్మోరు రూపును ధరించి “ఓం అమ్మోరు మారియమ్మ దేవతాయై నమః” అని దేవిని 108 మార్లు ప్రార్థిస్తే పోగొట్టుకున్నవి తిరిగి కాలానుగుణంగా
లభిస్తాయి. సమయపురం క్షేత్ర దర్శనం చేసుకోవడం చెప్పదగిన సూచన.
అమ్మోరు రూపును ధరించి “ఓం అమ్మోరు మారియమ్మ దేవతాయై నమః” అని దేవిని 108 మార్లు ప్రార్థించేవారిని ఆత్మలు, కొరివిదెయ్యాలు, నీటిదెయ్యాలు,
బ్రహ్మరాక్షసులు, దుష్టశక్తులు ఏమీ చేయలేవు. దెయ్యం పట్టినవారికి అమ్మోరు రూపును
ధరింపజేసినా దెయ్యాలు పారిపోతాయి. దెయ్యాలు నివసించే ఇంటికి అమ్మోరు రూపును
కట్టినా అవి ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతాయి.
అమ్మోరు మారియమ్మ ఆలయ గర్భగుడిలో చాలావరకు అమ్మోరు తల
మాత్రం మనకు దర్శనమిస్తుంది. దాని పరమార్థం ఏమిటంటే అమ్మోరు తల గర్భగుడిలో ఉంటే
ఆమె శరీరం ఆ ఊరి భూభాగం యావత్తు విస్తరించి ఆ ఊరి ప్రజలను, జంతు, పక్షి, వృక్షాలకు
వర్షం రూపంలో శ్రేయస్సు, మంచి పంటల వలన అభివృద్ధి, సహజ విపత్తుల నుండి రక్షణ
కలిగిస్తోందని అర్థం. కనుక ప్రతి ఒక్కరు అమ్మోరు రూపును ధరించి “ఓం అమ్మోరు మారియమ్మ దేవతాయై నమః” అని దేవిని ప్రతి నిత్యం 108 మార్లు ప్రార్థించి అమ్మోరు అనుగ్రహానికి
పాత్రులై జీవితంలో సర్వం పొందవచ్చు.
@ మల్లంపల్లి రామలింగ శాస్త్రి